ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుండటంతో ఆ జట్టుకు శుభారంభం లభించింది.
ముఖ్యంగా సాహా ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్ కూడా ఆరో ఓవర్లో ధాటిగా ఆడాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి గుజరాత్ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 54 పరుగులు చేసింది.