
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జరిగిన జాతీయ ఇన్లైన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం కైవసం చేసుకున్న ఆరేండ్ల వర్ధమాన స్కేటర్ కృష్ణ నిక్షిప్త్ను.. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. నొయిడా వేదికగా జరిగిన 59వ జాతీయ క్రీడల్లో హైదరాబాద్‌కు చెందిన కృష్ణ సబ్ జూనియర్ (5-7) కేటగిరీలో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. దీంతో కృష్ణను క్రీడా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి జోరుగా సాగుతున్నది. అత్యుత్తమ క్రీడాపాలసీని రూపొందించి రాష్ర్టాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నర్సింగ్, రాజ్, గిరి తదితరులు పాల్గొన్నారు.