Golden Bat Winners | వరల్డ్ కప్‌లో వీరబాదుడు.. గోల్డెన్ బ్యాట్ విజేతల్లో ముగ్గురు భారత క్రికెటర్లు
Golden Bat Winners : వరల్డ్ కప్(ODI World Cup).. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే అతి పెద్ద పండుగ. స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలకు కేరాఫ్ అయిన ఈ మెగా టోర్నీ మరో పదిహేను రోజుల్లో షురూ కానుంది. తమ క్లాస్ ఇన్నింగ్స్‌లతో అలరించిన పరుగుల వీరులు గోల్డెన్ బ్యాట్ (Golden Bat)అందుకున్నారు. వీళ్లలో ముగ్గురు....
Golden Bat Winners : వరల్డ్ కప్(ODI World Cup).. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే అతి పెద్ద పండుగ. స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలకు కేరాఫ్ అయిన ఈ మెగా టోర్నీ మరో పదిహేను రోజుల్లో షురూ కానుంది. ఒత్తిడిని పటాపంచలు చేస్తూ సెంచరీలతో కదం తొక్కే బ్యాటర్లు, బంతితో నిప్పులు చెరిగే పేసర్ల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరుగనుంది. అయితే.. అదేంటోగానీ 1975 నుంచి ఆనవాయితీగా బ్యాటర్లదే అధిపత్యం కొనసాగుతూ వస్తోంది. తమ క్లాస్ ఇన్నింగ్స్‌లతో అలరించిన పరుగుల వీరులు గోల్డెన్ బ్యాట్ (Golden Bat)అందుకున్నారు. వీళ్లలో ముగ్గురు భారత క్రికెటర్లు ఉండడం విశేషం. మిగతా వాళ్లు ఎవరు? ఏ ఏడాది ఎవరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు? అనే విశేషాలు మీ కోసం…
వన్డే ప్రపంచ కప్(ODI Wordl Cup)లో కొందరు ఆటగాళ్లు సంచలన ఆటతో తమ ముద్ర వేశారు. మరికొందరైతే సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన 1975 వరల్డ్ కప్‌లో ‘గోల్డెన్ బ్యాట్ విజేత’ ఎవరో తెలుసా..? గ్లెన్ టర్నర్ (Glenn Turner).
గ్లెన్ టర్నర్ – న్యూజిలాండ్

న్యూజిలాండ్‌కు చెందిన టర్నర్ ఈ టోర్నీలో 333 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 4 ఇన్నింగ్స్‌ల్లో 68. 51 స్ట్రయిక్ రేటుతో ఆడాడు. అత్యధిక స్కోర్. 171 నాటౌట్. అయితే.. ఆ ఏడాది క్లైవ్ లాయిడ్ సారథ్యంలోని వెస్టిండీస్ చాంపియన్‌గా నిలిచింది.
విండీస్ గోర్డన్
గోర్డన్ గ్రీనిడ్జ్(Gordon Greenidge) 1979 వరల్డ్ కప్‌లో గోల్డెన్ బ్యాట్(Golden Bat) సొంతం చేసుకున్నాడు. ఈ విండీస్(West Indies) బ్యాటర్ 253 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
గోర్డన్ గ్రీనిడ్జ్ – విండీస్

4 ఇన్నింగ్స్‌ల్లో 62.31 స్ట్రయిక్ రేటుతో ఆడిన గోర్డన్ ఒక సెంచరీ సాధించాడు. 1979లో వెస్టిండీస్ డిఫెండిగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగు పెట్టింది.
ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్
డేవిడ్ గోవర్ 1983 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ గోవర్(David Gover) చెలరేగి ఆడాడు. 7 ఇన్నింగ్స్‌లో 84.95 స్ట్రయిక్ రేటుతో 384 రన్స్ కొట్టాడు. గోవర్ అత్యధిక స్కోర్ 130.
డేవిడ్ గోవర్ – ఇంగ్లండ్

ఈసారి భారత జట్టు విజేతగా అవతరించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగినకపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలోని ఇండియా ఫైనల్లో విండీస్‌ను ఓడించి కప్పు సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ ప్లేయర్ గ్రాహం గూచ్(Graham Gooch) 1987 వరల్డ్ కప్‌లో వీర బాదుడు బాదాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 70.29 స్ట్రయిక్ రేటుతో ఏకంగా 471 పరుగులు సాధించాడు. మార్టిన్ క్రొవే(Martin Crowe) 1992 ప్రపంచ కప్‌లో దంచి కొట్టాడు. ఈ ఆస్ట్రేలియన్ ధనాధన్ బ్యాటింగ్‌తో 456 రన్స్ చేశాడు. మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 90.83 స్ట్రయిక్ రేటుతో ఆడాడు. ఈ టోర్నీలో అతడి అత్యధిక స్కోర్ 100.
సచిన్ టెండూల్కర్
భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 1996 వరల్డ్ కప్‌లో తన బ్యాట్ పవర్ చూపించాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌ల్లో 85.85 స్ట్రయిక్ రేటుతో 523 పరుగులు బాదాడు.
సచిన్ టెండూల్కర్ – భారత్

ఈ వరల్డ్ కప్‌లో సచిన్ అత్యధిక స్కోర్ 137. దాంతో, సచిన్ గోల్డెన్ బ్యాట్ అందుకున్నాడు. ఈ టోర్నీలో అర్జున రణతుంగా(Arjuna Ranatunga) కెప్టెన్సీలోని శ్రీలంక చాంపియన్‌గా నిలిచింది.
రాహుల్ ద్రవిడ్ – భారత్

జిడ్డు ఆటకు పేరొందొని భారత క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) 1999 ప్రపంచ కప్‌లో ఓ రేంజ్లో ఆడాడు. అంచనాలకు మించి రాణించి 461 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో ద్రవిడ్ అత్యధిక స్కోర్ 145.
మాస్టర్ బ్లాస్టర్ మ్యాజిక్
ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన 2003 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) మరోసారి తన మ్యాజిక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. మాస్టర్ బ్లాస్టర్ 11 ఇన్నింగ్స్‌ల్లో 89.25 స్ట్రయిక్ రేటుతో 673 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 152. సచిన్ మెరుపు బ్యాటింగ్‌తో ఇండియా ఫైనల్ చేరింది. కానీ అనూహ్యంగా ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది.
హేడెన్ విధ్వంసం
ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్(Mathew Heyden) 2007 వరల్డ్ కప్‌లో చెలరేగాడు. ఈ విధ్వంసక ప్లేయర్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 659 రన్స్ బాదాడు. ఈ వరల్డ్ కప్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ అత్యధిక స్కోర్ 158.
మాథ్యూ హేడెన్ – ఆస్ట్రేలియా

తిలకరత్నే దిల్షాన్
శ్రీలంక డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్(Tilakratne Dilshan) 2011 వరల్డ్ కప్‌లో బౌలర్లను ఉతికారేశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 90.72 స్ట్రయిక్ రేటుతో 500 పరుగులు చేశాడు.
తిలకరత్నే దిల్షాన్ – శ్రీలంక

ఈ వరల్డ్ కప్‌లో దిల్షాన్ టాప్ స్కోర్ 144. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక ఫైనల్ చేరాయి. అయితే.. గౌతం గంభీర్, ఎం ఎస్ ధోనీ(MS Dhoni) సంచలన ఆటతో ఇండియా రెండోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది.
గఫ్టిల్ డబుల్ సెంచరీ
న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్(Martin Guptil) 2015 ప్రపంచ కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గఫ్టిల్ 9 ఇన్నింగ్స్‌లో 547 రన్స్ బాదాడు. అతను వెస్టిండీస్‌పై ఏకంగా డబుల్ సెంచరీ(237 నాటౌట్) సాధించడం విశేషం.
మార్టిన్ గుఫ్టిల్ – న్యూజిలాండ్

రోహిత్ 5 సెంచరీలు
వన్డేల్లో 3సార్లు డబుల్ సెంచరీ బాదిన భారత స్టార్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2019లో విశ్వరూపం చూపించాడు. ఏకంగా 5 సెంచరీలతో చరిత్ర సృష్టించాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్ 98.33 స్ట్రయిక్ రేటుతో 648 రన్స్ చేశాడు.
రోహిత్ శర్మ – భారత్

టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బ్యాట్ అందుకున్నాడు. అయితే.. కీలకమైన సెమీస్‌లో విఫలమయ్యాడు. దాంతో, టీమిండియా న్యూజిలాండ్(Newzealand) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఇవి కూడా చదవండి
Gautam Gambhir | షారుక్ ఖాన్‌తో గంభీర్.. మళ్లీ కోల్‌కతా గూటికి చేరుతాడా?
Mustafizur Rahman | ఒకే స్టేడియంలో 50 వికెట్లు.. అరుదైన క్లబ్లో బంగ్లాదేశ్ పేసర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

