Mustafizur Rahman | ఒకే స్టేడియంలో 50 వికెట్లు.. అరుదైన క్లబ్లో బంగ్లాదేశ్ పేసర్
Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman) వన్డేల్లో మరో ఫీట్ సాధించాడు. ఒకే స్టేడియంలో 50 వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఘనత సొంతం చేసుకున్న 11వ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్(Newzealand)తో జరుగుతున్న తొలి వన్డేలో ముస్తాఫిజుర్ చాడ్ బొవెస్(1)ను....
Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman) వన్డేల్లో మరో ఫీట్ సాధించాడు. ఒకే స్టేడియంలో 50 వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఘనత సొంతం చేసుకున్న 11వ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్(Newzealand)తో జరుగుతున్న తొలి వన్డేలో ముస్తాఫిజుర్ చాడ్ బొవెస్(1)ను ఔట్ చేశాడు. దాంతో, మిర్పూర్లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ గ్రౌండ్ (Shere E Bangla National Stadium)లో 50వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాజితాలో బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ షకిబ్ 89 మ్యాచుల్లో 131 వికెట్లు కూల్చాడు. ఎడమ చేతివాటం పేసర్ అయిన ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ బౌలింగ్ యూనిట్‌కు వెన్నెముకలా మారాడు. ఈమధ్యే శ్రీలంకలో ముగిసిన ఆసియా కప్(Asia Cup 2023)లో ఈ స్టార్ పేసర్ వన్డేల్లో 150 వికెట్లు సాధించాడు.
Congratulations ‘The Fizz’
4th Bangladeshi bowler to reach 150 ODI wickets 🇧🇩 🫶#BCB | #Cricket pic.twitter.com/IZtnyzIfNT
— Bangladesh Cricket (@BCBtigers) September 16, 2023
కొలంబోలో భారత జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో అతను ఈ మైలురాయికి చేరాడు. దాంతో, ఈ ఫార్మాట్లో 150 వికెట్లు పడగొట్టిన నాలుగో బంగ్లా బౌలర్‌గా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించాడు. షకిబుల్ హసన్(308 వికెట్లు) ముష్రఫె మొర్తాజా(269 వికెట్లు), అబ్దుర్ రజాక్(207 వికెట్లు) మాత్రమే అతడి కంటే ముందున్నారు. మరో 15 రోజుల్లో భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ మొదల్వనుంది. ఈ మెగా టోర్నీలో ముస్తాఫిజుర్ బంగ్లాకు కీలకం కానున్నాడు. అక్టోబర్ 7న అఫ్గనిస్థాన్‌తో బంగ్లా తొలి మ్యాచ్ ఆడనుంది. షకిబుల్ హసన్ సారథ్యంలోని బంగ్లా ఈసారి మేరకు రాణిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
Asian Games 2023 | ఆసియా గేమ్స్‌లో బోణీ కొట్టిన భారత్.. నాకౌట్ ఆశలు సజీవం
ODI World Cup 2023 | దక్షిణాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ.. ప్రపంచ కప్ నుంచి ఆ ఇద్దరూ ఔట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

