హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: ఈ నెల 9, 10 తేదీల్లో పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన వరల్డ్ పారా ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హనుమకొండకు చెందిన ఎల్లావుల గౌతమ్ యాదవ్ స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్, ప్రధాన కార్యదర్శి ఈ గణేశ్యాదవ్అభినందించారు.
హైబ్రిడ్ మోడల్ మీకు ఓకేనా? ; పాక్ స్పందన కోరిన ఐసీసీ
కరాచీ: వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తాము ఆతిథ్య దేశం పాకిస్థాన్‌కు వెళ్లబోమని, హై బ్రిడ్ మోడల్ అయితే అంగీకరిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం మీకు సమ్మతమేనా? అని ఐసీసీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందన కోరినట్టు సమాచారం. బీసీసీఐ నిర్ణయాన్ని ఐసీసీ.. పీసీబీకి రాతపూర్వకంగా అందజేయగా దీనిపై ఆ దేశ బోర్డు ఎటువంటి ప్రకటనా చేయకపోగా హైబ్రిడ్ మోడల్‌పై ఇప్పటి వరకూ చర్చే జరుగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా? లేదా? అనే దానిపై అనిశ్చితి నెలకొంది. భారత్ కోరినట్టు చేస్తే టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లతో పాటు ఫైనల్ వేదికనూ మార్చాల్సి (భారత్ ఫైనల్ చేరితే) ఉంటుంది. ఇది పీసీబీకి తీవ్ర నష్టం చేకూర్చేదే. కాగా దీనిపై పీసీబీ ఏ నిర్ణ యం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.