Glenn Maxwell : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టిన అతను మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. భారతసంతతి అమ్మాయిని వివాహం చేసుకున్న ఈ స్టార్ ప్లేయర్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు వెల్లడించాడు.
గర్భవతి అయిన అతడి భార్య వినీ రామన్(Vini Raman) తమ బేబీ ఆల్స్ట్రా సౌండ్ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మ్యాక్స్‌వెల్, నేను రెయిన్బో బిడ్డ( Rainbow Baby)కు జన్మనివ్వబోతున్నాం. ఈ విషయాన్ని అందరీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం మాకు అంత తేలికగా సాగలేదు.
మొదటిసారి బిడ్డను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డాం. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు మా ప్రేమను తెలియజేస్తున్నాం’ అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మ్యాక్స్‌వెల్ దంపతులు రెయిన్బో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇన్‌స్టాలో ఫొటోలు చూసిన చాలామంది ఈ జంటకు కంగాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.
రెయిన్బో బేబీ అనే పదాన్ని ఈ మధ్య ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి అర్థం ఏంటో తెలుసా..? గర్భస్రావం లేదా 20 వారాత తర్వాత తల్లి కడుపులోనే బేబీ చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డను రెయిన్బో బేబీ అని అంటారు. భారత సంతతికి చెందిన వినీ రామన్ మెల్బోర్న్లో స్థిరపడింది. ఆమె ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. మ్యాక్స్‌వెల్, వినీ గత ఏడాది మార్చి 18న వివాహం చేసుకున్నారు.
ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడైన మ్యాక్స్‌వెల్ గత ఏడాది పెద్దగా రాణించలేదు. కానీ ఈ సీజన్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. 11 మ్యాచుల్లో 330 రన్స్ కొట్టాడు. అందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్ దంచికొట్టాడు. 33 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. కెప్టెన్ డూప్లెసిస్(65) హాఫ్ సెంచరీ బాదడంతో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 199 కొట్టింది. కానీ, లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్(83 : 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీలా విరుచుకుపడడంతో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముంబై ఇండియన్స్‌పై ఫిఫ్టీ కొట్టిన మ్యాక్స్‌వెల్(68) – డూప్లెసిస్(65)