Team India : స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్‌కు దక్షిణాఫ్రికాపై వన్డే విక్టరీతో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లోనూ సఫారీలను చిత్తు చేయాలనుకుంటోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుసగా సిరీస్‌లు గెలుస్తున్న భారత్ .. రేపు బరామతి స్టేడియంలో బోణీ కొట్టాలనే పట్టదలతో ఉంది. మెడ గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి టీ20 కోసం నెట్స్‌లో చెమటోడ్చాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున మెరవాలని భావిస్తున్నాడు. అయితే.. అతడు సోమవారం నెట్స్ సెషనల్లో పాల్గొనలేదు. కానీ, గిల్ మాత్రం రెండు గంటలు అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్ చేశాడు. తిలక్ వర్మ, శివం దూబే, సుందర్.. బౌలింగ్ దళంలోని బుమ్రా, కుల్దీప్, వరుణ్, అర్ష్‌దీప్ నెట్స్‌లో గడిపారు. అయితే.. గిల్, పాండ్యా రాకతో తుదిజట్టు ఎంపిక ఆసక్తి రేపుతోంది. వికెట్‌కీపర్‌గా సంజూ శాంసన్(Sanju Samson)ను తీసుకుంటారా? జితేశ్ శర్మ (Jitesh Sharma) ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
T20I Series ready 💪#TeamIndia is geared 🆙 #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/xZjIITGDcS
— BCCI (@BCCI) December 8, 2025
భారత తుది జట్టు అంచనా : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ / జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.