IND vs AUS : ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు(Indian Batters) ఆకాశమే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఓపెనర్ శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(72 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) దంచి కొట్టారు. దాంతో, టీమిండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) బౌలింగ్ తీసుకున్నాడు. అతడి అంచనాలను నిజం చేస్తూ కంగారు బౌలర్లు ఆదిలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8) వికెట్ తీశారు. అయితే.. ఆ తర్వాతే అసలు విధ్వంసం మొదలైంది. ఆసీస్ పేసర్లను ఉతికారసిన శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో కదం తొక్కారు.
Innings break!#TeamIndia post 399/5, their highest total in ODIs against Australia 👏👏
💯s from Shreyas Iyer & Shubman Gill
72* from Suryakumar Yadav
52 from Captain KL RahulScorecard ▶️ https://t.co/OeTiga5wzy#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/jx0UbtB13r
— BCCI (@BCCI) September 24, 2023
గిల్ 93 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో శతకం సాధించాడు. ఈ ఫార్మాట్లో గిల్‌కు ఇది ఐదో శతకం. దాంతో, 50 ఓవర్ల ఆటలో ఒకే ఏడాది 5 సెంచరీలు బాదిన ఏడో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 200 పరుగులు జోడించారు.
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav) మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సులు బాదాడు. అతడి ఊపు చూస్తుంటే 2007 టీ20 వరల్డ్ కప్‌లో
6⃣6⃣6⃣6⃣
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
— BCCI (@BCCI) September 24, 2023
యువరాజ్ సింగ్(Yuvraj Singh)లా ఆర్ సిక్స్‌లు కొడతానిపించింది. కానీ, గ్రీన్ ఐదో బంతిని తెలివిగా వేయడంతో సింగిల్ మాత్రమే వచ్చింది. సూర్య ధాటికి ఆ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి.