Headingley Test : కెప్టెన్‌గా తొలి పర్యటనలోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆకట్టుకున్నాడు. పేస్, స్వింగ్‌తో బెంబేలెత్తించాలనుకున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని తిప్పకొడుతూ అర్ధ శతకం సాధించాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో విరుచుకుపడిన గిల్.. జోష్ టంగ్ ఓవర్లో మిడ్ వికెట్ బౌండరీతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు బాదిన అతడికి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అంతేకాదు.. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 50 కొట్టిన తొమ్మిదో భారత క్రికెటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు.
మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. టంగ్ ఓవర్లో అతడు ఆఫ్ సైడ్ భారీ సిక్సర్ బాదడంతో స్కోర్ 170 దాటింది. లంచ్ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తున్న ఈ జోడీ మూడో వికెట్‌కు ఇప్పటికే 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్. 189-2.
… and Shubman Gill starts Test captaincy journey with a FIFTY! 👌 👌
Updates ▶️ https://t.co/CuzAEnBkyu #TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/T6SzNlypyn
— BCCI (@BCCI) June 20, 2025
హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. లంచ్ లోపే 92కు రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80 నాటౌట్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(57 నాటౌట్) ఆదుకున్నారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడుతూ అర్ధ శతకాలు సాధించారు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ. తద్వారా ఐదు జట్లతో ఆడిన తొలి టెస్టులో నాలుగోసారి యాభై రన్స్‌తో రికార్డు నెలకొల్పాడీ యంగ్‌స్టర్. మరోవైపు సారథిగా తొలి మ్యాచ్ ఆడుతున్న గిల్.. బౌండరీలతో చెలరేగుతున్నాడు. వోక్స్, టంగ్, స్టోక్స్.. ఎవరినీ వదలకుండా ఉతికేస్తున్నాడు.