Headingley Test | కెప్టెన్‌గా తొలి అర్ధ శతకం బాదిన గిల్.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న యశస్వీ..!
Headingley Test : కెప్టెన్‌గా తొలి పర్యటనలోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆకట్టుకున్నాడు. పేస్, స్వింగ్‌తో బెంబేలెత్తించాలనుకున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని తిప్పకొడుతూ అర్ధ శతకం సాధించాడు.
Headingley Test : కెప్టెన్‌గా తొలి పర్యటనలోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆకట్టుకున్నాడు. పేస్, స్వింగ్‌తో బెంబేలెత్తించాలనుకున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని తిప్పకొడుతూ అర్ధ శతకం సాధించాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో విరుచుకుపడిన గిల్.. జోష్ టంగ్ ఓవర్లో మిడ్ వికెట్ బౌండరీతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు బాదిన అతడికి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అంతేకాదు.. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 50 కొట్టిన తొమ్మిదో భారత క్రికెటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు.
మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. టంగ్ ఓవర్లో అతడు ఆఫ్ సైడ్ భారీ సిక్సర్ బాదడంతో స్కోర్ 170 దాటింది. లంచ్ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తున్న ఈ జోడీ మూడో వికెట్‌కు ఇప్పటికే 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్. 189-2.
… and Shubman Gill starts Test captaincy journey with a FIFTY! 👌 👌
Updates ▶️ https://t.co/CuzAEnBkyu #TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/T6SzNlypyn
— BCCI (@BCCI) June 20, 2025
హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. లంచ్ లోపే 92కు రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80 నాటౌట్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(57 నాటౌట్) ఆదుకున్నారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడుతూ అర్ధ శతకాలు సాధించారు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ. తద్వారా ఐదు జట్లతో ఆడిన తొలి టెస్టులో నాలుగోసారి యాభై రన్స్‌తో రికార్డు నెలకొల్పాడీ యంగ్‌స్టర్. మరోవైపు సారథిగా తొలి మ్యాచ్ ఆడుతున్న గిల్.. బౌండరీలతో చెలరేగుతున్నాడు. వోక్స్, టంగ్, స్టోక్స్.. ఎవరినీ వదలకుండా ఉతికేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- Headingley Test | కెప్టెన్‌గా తొలి అర్ధ శతకం బాదిన గిల్.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న యశస్వీ..!
- కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి..
- Nakrekal : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు : ఎమ్మెల్యే వేముల వీరేశం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

