నకిరేకల్, జూన్ 20 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని మండలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 45 ఇళ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ నెల 22న నియోజకవర్గంలోని 3,500 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, హౌజింగ్ ఏఈ మధుశాలిని, పంచాయతీ కార్యదర్శి నాగమణి, మాజీ సర్పంచులు దండి నాగేశ్వరరావు, తీగల జంగయ్య, నాయకులు గాదగోని కొండయ్య, బచ్చుపల్లి గంగాధర్‌రావు, లింగాల వెంకన్న పాల్గొన్నారు.