Hockey World Cup : హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు (Team India) పోరాటం ముగిసింది. ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా అనూహ్యంగా ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది. ఓడిపోయింది. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ (Germany) చేతిలో కంగుతిన్నది. దాంతో.. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఫైనల్ కల కలగానే మిగిలింది.. ఫైనల్లో స్పెయిన్‌తో జర్మనీ తలపడనుంది.
చెన్నై వేదికగా జరుగుతన్న హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆఖర్లో తడబడింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంపై 4-3తో సంచలన విజయం సాధించిన టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో జర్మనీపై పైచేయి సాధించే అవకాశాల్ని భారత ఫార్వర్డ్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో.. 1-5తో టీమిండియా ఓటమి పాలైంది. ఫైనల్ ఛాన్స్ మిస్ కావడంతో మూడో, నాలుగో స్థానం కోసం భారత్ తలపడనుంది. గతంలో హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో 2016లో భారత్ ఫైనల్ చేరింది. లక్నో వేదికగా జరిగిన టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా.
𝐅𝐮𝐥𝐥-𝐭𝐢𝐦𝐞: 𝐈𝐧𝐝𝐢𝐚 𝟏–𝟓 𝐆𝐞𝐫𝐦𝐚𝐧𝐲.
A tough Semi-Final outing at the FIH Hockey Men’s Junior World Cup Tamil Nadu 2025, but proud of the spirit shown by our boys. 🇮🇳#HockeyIndia #IndiaKaGame #FIHMensJuniorWorldCup #RisingStars #JWC2025 pic.twitter.com/Fb3Lp18I26
— Hockey India (@TheHockeyIndia) December 7, 2025