ముల్హీమ్ (జర్మనీ): కొద్దిరోజుల క్రితమే చైనాలో ముగిసిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు స్వల్ప విరా మం తర్వాత మరో బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ (బీడబ్ల్యూఎఫ్) ఈవెంట్‌కు సిద్ధమయ్యారు. జర్మనీలోని ముల్హీమ్ వేదికగా జరుగబోయే బీడబ్ల్యూఎఫ్- సూపర్ 300 ఈవెంట్లో షట్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పీవీ సింధు, సాత్విక్-చిరాగ్ ద్వయం, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ వంటి స్టార్ షట్లర్లు పలు కారణాలతో ఈ ఈవెంట్ నుంచి తప్పుకోగా భారత దళాన్ని మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. ప్రస్తుతం 45 ప్రపంచ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. తొలి మ్యాచ్‌లో భారత్‌కే చెందిన యువ సంచలనం ప్రియాన్షు రజావత్‌తో తలపడనున్నాడు. కిరణ్ జార్జి కూడా అయూష్ శెట్టి (భారత్)తో ఆడాల్సి ఉంది. మహిళల సింగిల్స్‌లో అనుపమ, ఇషారాణి ఆకర్షి, రక్షిత రామ్రాజ్, అన్మోల్ ఖర్బ్ వంటి యువ క్రీడాకారులు బరిలో నిలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.