Sunil Gavaskar : వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం భారత స్క్వాడ్ ఎంపికలో సెలెక్టర్లు మరోసారి తమ మార్క్ చూపించారు. మెగా టోర్నీ సమీపిస్తున్నందున ఫామ్‌లోలేని శుభ్‌మన్ గిల్ (Shubman Gill)పై వేటు వేసి.. సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. ఈ నిర్ణయం అందరూ ఊహించిందే. వరల్డ్ క్లాస్ బ్యాటరైన అతడిని తప్పించడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) స్పందించాడు. వరల్డ్ కప్ స్క్వాడ్‌కు ఎంపిక చేయనందుకు గిల్ నిరాశకు లోనవ్వకూడదని.. పాజిటివ్‌గా తీసుకోవాలని సన్నీ పేర్కొన్నాడు.
స్వదేశంలో ఫిబ్రవరి 7 న మొదలయ్యే టీ20 ప్రపంచకప్ ఆడాలనుకున్న శుభ్‌మన్ గిల్ కల చెదిరింది. పొట్టి క్రికెట్లో శతక వీరుడైన అతడి పేలవ ఫామ్ దృష్ట్యా స్క్వాడ్‌లోకి తీసుకోలేదు సెలెక్టర్లు. గిల్‌పై వేటు నెట్టింట చర్చనీయాంశమైన వేళ.. గవాస్కర్ మాట్లాడుతూ అహ్మదాబాద్ నుంచి ఒకే విమానంలో నేను, శుభ్‌మన్ గిల్ వెళ్లాం. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన అతడితో మాట్లాడాను. ఇంటికి వెళ్లి దిస్టి తీయించుకో. మనం ఇలాంటివి నమ్ముతాం అని చెప్పాను అని సన్నీ గుర్తు చేసుకున్నాడు.
Sunil Gavaskar on Shubman Gill:
“I was on the same flight from Ahmedabad with Shubman. Seeing him miss games due to injury and form, I told him ghar jaakar kisi buzurg se nazar utarwana. We believe in these things. He’s a class player. Just because of form and a late return to… pic.twitter.com/fn8crrrnTZ
— GURMEET GILL (@GURmeetG9) December 20, 2025
‘పొట్టి ప్రపంచకప్ స్క్వాడ్‌లో శుభ్‌మన్ గిల్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అతడు నాణ్యమైన బ్యాటర్. గిల్ కొన్ని మ్యాచుల్లో ఇబ్బందిపడ్డాడు. అయితే.. చివరకు క్లాస్ ఆటతో అతడు ఫామ్ అందుకుంటాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన గిల్ లయ అందుకోలేదు. ఐపీఎల్లో అతడు ఎంత బాగా ఆడాడో చూశాం. కానీ, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతడు టచ్‌లో కనిపించలేదు. వరల్డ్‌కప్ కోసం పరిగణించకపోవడాన్ని అతడు నెగెటివ్‌గా తీసుకోవద్దు. గిల్ త్వరగా ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నా’ అని గవాస్కర్ అన్నాడు.
For the first time, Gautam Gambhir and Ajit Agarkar have made the right decision by dropping Shubman Gill 👏🏻
How satisfied are you with this decision ? pic.twitter.com/yxsyLeUGyD
— Richard Kettleborough (@RichKettle07) December 20, 2025
ఈ ఏడాది టెస్టు, వన్డే సారథిగా బాధ్యతలు చేపట్టిన గిల్.. టీ20ల్లో వైస్ కెప్టె్న్ కూడా. టాపార్డర్ విఫలమైన వేళ బాధ్యతగా ఆడాల్సిన అతడు.. సఫారీలపై 3 మ్యాచుల్లో 32 రన్స్‌తో నిరాశపరిచాడు. ఈ ఏడాది టీమిండియా స్టార్ 15 మ్యాచుల్లో 24.25 సగటుతో 291 రన్స్ చేశాడంతే. దాంతో.. ఫామ్‌లో లేని అతడిని వరల్డ్‌కప్‌లో ఆడించి రిస్క్ తీసుకోవడం కంటే టచ్‌లో ఉన్న శాంసన్‌ను ఆడించడమే ఉత్తమమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం భావించింది.