GGW vs RCBW : డబ్ల్యూపీఎల్‌లో అజేయంగా దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వడదోరలోనూ భారీ స్కోర్ చేసింది. అలాఅనీ ఈసారి ఓపెర్లు దంచేయలేదు. అయినా సరే ఆ జట్టు 178 పరుగులు చేసిందంటే గౌతమి నాయక్(73) చలవే. పవర్ఫుల్ షాట్లతో అలరించిన గౌతమి.. మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడి భారీ స్కోర్‌కు బాటలు వేసింది. ఆఖర్లో రీచా ఘోష్(27), రాధా యాదవ్(17)ల విధ్వంసంతో గుజరాత్‌కు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్సీబీ.
టాస్ ఓడిన ఆర్సీబీకి షాకిస్తూ ఆరంభంలోనే రెండు బిగ్ వికెట్లు తీశారు గుజరాత్ జెయింట్స్ బౌలర్లు. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(1)ను మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ వెనక్కి పంపింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ జార్జియా వోల్(1)ను కష్వీ గౌతమ్ క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. పరుగులకే ఆర్సీబీ విధ్వంసక ప్లేయర్లు డగౌట్ చేరారు. అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన(26), గౌతమీ నాయక్(73) లు కీలక భాగస్వామ్యం నిర్మించారు.
Innings Break!
Useful contributions from the batters propel #RCB to 1️⃣7️⃣8️⃣ 🎯
Can they make it a perfect 5⃣ or will #GG chase it down? 🤔
Scorecard ▶️ https://t.co/KAjH515c64 #TATAWPL | #KhelEmotionKa | #GGvRCB pic.twitter.com/1NsCun3jTk
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026
మంధానను ఎల్బీగా ఔట్ చేసిన గార్డ్నర్ ఈ జోడీని విడదీసింది. ఆ తర్వాత రీచా ఘోష్(27) జతగా ఆర్సీబీ స్కోర్ బోర్డును నడిపించిన గౌతమి హాఫ్ సెంచరీ సాధించింది. కాసేపటికే రీచా పెద్ద షాట్ ఆడబోయి బౌండరీ వద్ద గార్డ్నర్ చేతికి క్యాచ్ ఇచ్చింది. అనంతరం రాధా యాదవ్(17) డెవినె ఓవర్లో భారీ సిక్సర్‌తో స్కోర్ 160 దాటింది. కష్వీ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే కవర్స్‌లో రాధ బౌండరీకి పంపింది. రెండో బంతికి ఫోర్ బాదిన తను ఔటయ్యాక వచ్చిన శ్రేయాంక పాటిల్(8 నాటౌట్) స్వీప్ షాట్‌తో ఫోర్ సాధించగా 17 రన్స్ వచ్చాయి. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 కొట్టింది.