లండన్ : ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ. ఇంగ్లండ్ గడ్డపై ఈసారి ఎలాగైనా సిరీస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియాకు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ దూరమయ్యాడు. తల్లి సీమా గంభీర్‌కు గుండెపోటు రావడంతో అతను హుటాహుటిన స్వదేశానికి బయల్దేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో ధృవీకరించింది. గుండెపోటుకు గురైన గంభీర్ తల్లికి ప్రస్తుతం ఢిల్లీలోని దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు బోర్డు పేర్కొంది.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు గంభీర్ జట్టుతో కలిసే అవకాశమున్నట్లు తెలిసింది. గంభీర్ గైర్హాజరీలో సహాయక కోచ్ ర్యాన్‌టెన్ డస్కటే.. టీమ్ఇండియాకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై అవగాహన సాధించేందుకు ప్రస్తుతం భారత్ ‘ఏ’, ప్రధాన జట్ల మధ్య నాలుగు రోజుల సన్నాహక మ్యాచ్ జరుగుతున్నది. దీని ద్వారా తుది జట్టు ఎంపికపై ఒక స్పష్టతకు రానున్నారు.