Gautam Gambhir | ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు గౌతం గంభీర్ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యాడు. టీమ్ఇండియా హెడ్‌కోచ్ రేసులో గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో గౌతి.. షాతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ అనంతరం గంభీర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్పందిస్తూ.. హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సాధారణ ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపానని వెల్లడించాడు.
ఇదిలాఉండగా ‘మెన్ ఇన్ బ్లూ’కు ప్రధాన కోచ్‌గా గంభీర్ పేరు దాదాపు ఖాయమైనట్టేనని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గంభీర్ పెట్టిన షరతులకు (సహాయక కోచింగ్ సిబ్బంది నియామకంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని) బీసీసీఐ పచ్చజెండా ఊపిందని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగానే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న జాంటీ రోడ్స్‌ను భారత జట్టుకు తీసుకురానున్నట్టు సోమవారం సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. గంభీర్, రోడ్స్.. రెండేండ్ల పాటు లక్నో జట్టుకు సేవలందించిన విషయం విదితమే.