Gautam Gambhir | హార్దిక్ కంటే.. పృథీషా మెరుగైన కెప్టెన్..!
Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమి అనంతరం జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. కపిల్ దేవ్ వంటి మాజీలు సైతం కెప్టెన్ రోహిత్ శర్మపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అప్పటి నుంచి 2024 టీ20 ప్రపంచకప్
Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమి అనంతరం జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. కపిల్ దేవ్ వంటి మాజీలు సైతం కెప్టెన్ రోహిత్ శర్మపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అప్పటి నుంచి 2024 టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు బీసీసీఐ సన్నాహాలు చేస్తోందని, పొట్టి క్రికెట్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనుందని వార్తలు వచ్చాయి. అనంతరం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై సైతం బీసీసీఐ వేటు వేసింది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను ఎంపిక చేసే బాధ్యతను కొత్త సెలెక్టర్లకు అప్పగించింది.
దీంతో రోహిత్ శర్మకు వన్డే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అదే సమయంలో టీ20 ఫార్మాట్‌కు హార్దిక్ ప్యాండ్యాను కెప్టెన్‌గా నియమించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, భారత జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీ20 కెప్టెన్‌గా పృథీ షా పేరును ప్రతిపాదించాడు. అతను కెప్టెన్‌గా నిరూపించుకోగలడని చెప్పాడు. కెప్టెన్ రేసులో హార్దిక్ ముందున్నాడని, కానీ రోహిత్‌కు ఇది దురదృష్టకరమని, ఒక ఐసీసీ ఈవెంట్‌తోనే అతని కెప్టెన్సీని నిర్ధారించడం సరైంది కాదన్నాడు.
భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలున్న వారిలో యువ ఆటగాడు పృథ్వీషా ఉన్నాడన్న గంభీర్.. డోపింగ్ పరీక్షల్లో విఫలమవడంతో 2019లో సస్పెండ్ చేసిన తర్వాత ఫిట్నెస్ సమస్యలతో జట్టులో స్థానం స్థిరంగా ఉండడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. పృథ్వీ షా చివరిసారిగా జూలై 2021లో భారత్ తరఫున ఆడాడు. 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడంతో పాటు సరైన మార్గంలో నడిపించడం సెలెక్టర్ల పని అన్నాడు. పృథ్వీషా దూకుడుగా ఆడుతాడని, విజయవంతంమైన కెప్టెన్‌గా ఉండగలడు.. ఎందుకంటే అతని దూకుడును చూడవచ్చని చెప్పాడు.
అయితే, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో 2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించాడు. రంజీలో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉన్నది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. అతని కెప్టెన్సీలో బరిలోకి దిగిన తొలి సీజన్లోనే గుజరాత్ ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. ఐర్లాండ్ పర్యటనలో హార్దిక్ తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించగా.. సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరిస్‌ను 1-0 భారత్ కైవసం చేసుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

