MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది గుజరాత్ జెయింట్స్. పవర్ ప్లేలో ముంబై బౌలర్ల జోరుతో తడబడిన గుజరాత్‌ను కెప్టెన్ అష్లీ గార్డ్నర్(46), జార్జియా వరేహం(44 నాటౌట్)లు ఆదుకున్నారు. 71కే 3 వికెట్లు పడిన వేళ వీరిద్దరూ తమ విధ్వంసక ఆటతో చెలరేగారు. బౌండరీల మోతతో ముంబై బౌలర్లను బెంబేలిత్తించారు. దాంతో, గుజరాత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లే కోల్పోయి 167 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన గుజరాత్ భారీ స్కోర్ కొట్టాలనుకుంది. కానీ. పవర్ ప్లేలోనే ఓపెనర్ బేత్ మూనీ(5)ని సంజన కళ్లుచెదిరే డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది. సోఫీ డెవినె(25), అనుష్క శర్మ(33)లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. అమేలియా ఓవర్లో సిక్సర్ బాదిన అనుష్క.. ఆ తర్వాతి బంతికే షబ్నం చేతికి చిక్కింది. బ్రంట్ ఓవర్లో పెద్దషాట్ ఆడిన డెవినె బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో.. 71కే మూడు వికెట్లు పడ్డాయి. కెప్టెన్ అష్లీ గార్డ్నర్(46), జార్జియా వరేహం(44 నాటౌట్)లు ఆదుకున్నారు.
Getting into the groove! 💪
🎥 A couple of mighty maximums from #GG Captain Ashleigh Gardner and Georgia Wareham 🔥
Updates ▶️ https://t.co/0ABkT4KS2M #TATAWPL | #KhelEmotionKa | #GGvMI pic.twitter.com/Hw5QeYhd1r
— Women’s Premier League (WPL) (@wplt20) January 30, 2026
క్రీజులో కుదురుకునేంత వరకూ నింపాదిగా ఆడిన గార్డ్నర్, వరేహంలు ఆ తర్వాత రెచ్చిపోయారు. 15వ ఓవర్లో గేర్ మార్చిన గార్డ్నర్ వరుసగా 6, 4, 4 నాలుగో బంతికి బౌండరీతో ఏకంగా19 రన్స్ పిండుకుంది. ఆ తర్వాతి ఓవర్లో షబ్నం ఇస్మాయిల్‌ను ఉతికేస్తూ వరేహం, ఆమె రెండేసి ఫోర్లు కొట్టడంతో స్కోర్ 140 దాటింది. గార్డ్నర్ ఔటయ్యాక భారతి ఫుల్మాలి(5 నాటౌట్) జతగా వరేహం రెచ్చిపోయింది. బ్రంట్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ సంధించిన తను.. ఆఖరి ఓవర్లో 7 పరుగులే రాబట్టింది. ఫలితంగా.. గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కేర్ (2-26) రాణించింది.