Gautam Gambhir : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సీజన్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. అయితే.. ఇదంతా ఒక్కరోజులోనే సాధ్యం కాలేదు. స్క్వాడ్‌లో యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు దూకుడే మంత్రగా ఆడాలనే ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సూచనలతోనే టీమిండియా చెలరేగిపోతోంది. స్వదేశంలో మరోసారి భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. కోచ్ గంభీర్ తన కెరీర్‌లోని చీకటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
పేరుకు తగ్గట్టే ఎల్లప్పుడూ గంభీరంగా కనిపించే అతడు విమర్శలను, ఓటమిని అంత తేలికగా తీసుకోడు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే గడ్డుకాలం ఎదుర్కొన్నాడు.శ్రీలంకపై వన్డే సిరీస్‌లో విజయంతో తిరిగొచ్చిన అతడికి స్వదేశంలో మాత్రం చుక్కెదురైంది. స్వదేశంలో తిరుగులేని విజయాలతో రికార్డు నెలకొల్పిన భారత జట్టు అనూహ్యంగా న్యూజిలాండ్ న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఆ సిరీస్ వైట్వైట్కు గురవ్వడంతో అందరూ గంభీర్‌ను తిట్టిపోశారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra)తో ఆనాటి రోజుల్ని గౌతీ యాది చేసుకున్నాడు.
The shocking 3-0 series loss to New Zealand still hurts India head coach, Gautam Gambhir.#TeamIndia pic.twitter.com/lCO7pHZzrj
— Circle of Cricket (@circleofcricket) October 11, 2025
ఢిల్లీ టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో స్టార్ స్పోర్ట్స్ గంభీర్ ఇంటర్వ్యూ వీడియోను టెలిక్యాస్ట్ చేసింది. అందులో.. గంభీర్. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమిని తాను ఎన్నటికీ మర్చిపోనని తెలిపాడు. ‘స్వదేశంలో ఆధిపత్యం గురించి అడిగాడు. అందుకు.. ప్రపంచంలో అత్యుత్తమ జట్టు అవ్వాలనుకోవడం పెద్ద విషయం కాదు. స్వదేశంలో ప్రత్యర్ధిపై ఆధిపత్యం చెలాయించడంతో సరిపెట్టుకోకుండా విదేశాల్లోనూ అదే జోరు కనబరచాలి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత్ ఇప్పటికే తమ తడాఖా చూపిస్తోంది.
Gautam Gambhir Era 🤡
– Lost ODI Series vs SL
– Lost Test series vs NZ at home
– Lost Test At Chinnaswamy
– Bowled out for 46 at home
– Ended the 12 year Test series win streak
– Lost Pink ball Test
– Lost MCG test
But still, PR must continue #INDvsAUS pic.twitter.com/2RZW0heKQj— 🅰️ J (@EHuman0) December 30, 2024
కోచ్‌గా నాకు.. కెప్టెన్‌గా గిల్‌కు ఇంగ్లండ్ సిరీస్ కఠినమైనది. అనుభవంలేని కుర్రాళ్లతో కూడిన జట్టు ఎంతో గొప్పగా ఆడింది. .. ముఖ్యంగా.. ఫలితం కంటే వాళ్లు పోరాడిన తీరు నాకు చాలా నచ్చింది. స్వదేశంలో జయభేరి మోగించడం ద్వారానే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుతామనే విషయంపై నాకు అంతగా నమ్మకం లేదు. ఎందుకంటే.. సొంతగడ్డపైనే ఆధిపత్యం చెలాయిస్తే..డబ్ల్యూటీసీ విజేతగా అవతరించలేం’ అని గంభీర్ వెల్లడించాడు.
స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ ఓటమి గురించి ఆకాశ్ చోప్రా ప్రశ్నించగా గంభీర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘కివీస్ చేతిలో దారుణ ఓటమిని నాకోచింగ్ కెరీర్ పూర్తైనా సరే మర్చిపోలేను. ఇదే విషయాన్ని భారత ఆటగాళ్లకు చెబుతుంటాను. అయితే.. అపజయాల నుంచి తేరుకొని ముందుకెళ్లడం చాలా ముఖ్యం. అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ముఖ్యమే. లేదంటే ప్రతివిషయాన్ని తేలికగా తీసుకుంటారు. కానీ, అలా చేస్తే షాక్ తప్పదు. న్యూజిలాండ్‌ను సులువగా ఓడిస్తామని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సిరీస్ ఓటమి ఎదురైంది. ఆటలో ఏదైనా సాధ్యమే. అందుకే ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు’ అని గంభీర్ పేర్కొన్నాడు.
A Test series defeat for India on home soil after 11 years, 10 months & 9 days 😱#INDvNZ pic.twitter.com/35fdIPL4tU
— Sport360° (@Sport360) October 26, 2024