సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ నయా వాల్ చెటేశ్వర్ పుజారా ఈ మధ్య ఆడుతున్న తీరు చాలా మందికి మింగుడు పడటం లేదు. మరీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ పుజారా మరోసారి ప్రత్యర్థి బౌలర్లతోపాటు అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. అతడు తన తొలి పరుగు చేయడానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి పుజారా ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టిన అతడు చివరికి 54 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌పై ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
Cricket Purists watching Pujara… pic.twitter.com/1dNZSxeOTb
— El Niño🇮🇳 (@suppandiiii) June 19, 2021
scene after pujara sir opened his account with a boundary pic.twitter.com/hT3vAR1ySb
— A.A. 6.0 (@iamFirki) June 19, 2021