Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు బుధవారం నుంచి సఫారీలతో కీలకమైన రెండో టెస్టులో తలపడనుంది. సెంచూరియన్ వేదికగా ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో ఓడిన మెన్ ఇన్ బ్లూ.. రెండో టెస్టు ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ కోల్పోయే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు అత్యావశ్యకం. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ కోల్పోయిన భారత్.. రెండో టెస్టులో అయినా ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉన్న కోహ్లీపైనా భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.
సఫారీలతో ఆడబోయేది రెండో టెస్టు అయినప్పటికీ ఈ ఏడాది భారత్‌కు కేప్‌టౌన్ వేదికగా జరుగబోయేది తొలి టెస్టు. మరి ప్రతి ఏడాది తాను ఆడిన తొలి టెస్టులో కోహ్లీ ఎలా ఆడాడు..? ఆరంభాలు అదరగొట్టాడా..? లేక విఫలమయ్యాడా..? అన్నది ఇక్కడ చూద్దాం. 2011లో టెస్టులలో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. 2012 నుంచి 2023 దాకా జరిగిన మ్యాచ్‌లలో ప్రదర్శనలు కింది విధంగా ఉన్నాయి.
– 2012లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లీ చేసిన పరుగులు 23, 9.
– 2013లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (107).. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు.
– 2014లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్.. 4,67 పరుగులు చేశాడు.
– 2015లో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో మ్యాచ్.. 147, 46 రన్స్ చేశాడు.
– 2016లో నార్త్ సౌండ్ వేదికగా విండీస్‌తో మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్‌లో 200, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు.
Virat Kohli had an extended practice session to an hour ahead of 2nd Test match. [PTI] pic.twitter.com/rzCBb6h2Fp
— Johns. (@CricCrazyJohns) January 1, 2024
– 2017లో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 204, 38 పరుగులు సాధించాడు.
– 2018లో కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 5, 28 రన్స్.
– 2019లో సిడ్నీలో ఆసీస్‌తో మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్‌లో 23 రన్స్
– 2020లో వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో పోరులో 2, 19 పరుగులు మాత్రమే చేశాడు.
– 2021లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11, 72 రన్స్.
– 2022లో కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 79, 29 పరుగులు సాధించాడు.
– 2023లో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 12 రన్స్. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు.
– 2018, 2022లలో కేప్‌టౌన్ వేదికగానే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. రెండు టెస్టులలో (5, 28, 79, 29) 141 పరుగులు చేశాడు. మరి రేపు కూడా కేప్‌టౌన్ లోనే కోహ్లీ ఈ ఏడాది ఫస్ట్ టెస్టు ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది..