తగ్గేదేలే..కొట్లాడుదాం!
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ నమ్మించి మోసం చేసిందని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ మాత్రం సానుకూలంగా లేదని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన తర్వాత ఎంప్లాయీస్ జేఏసీ నేతలు బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో అత్యవసరంగా సమావేశమయ్యారు.
- ప్రభుత్వమో.. ఉద్యోగులో తేల్చుకునే సమయం ఆసన్నమైంది
- సర్కారే ఉద్యోగులను నమ్మించి నాన్చడం దారుణం
- ఉద్యమంతోనేబుద్ధి చెబుదాం
- ఎంప్లాయీస్ జేఏసీ అంతర్గత సమావేశంలో నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ నమ్మించి మోసం చేసిందని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ మాత్రం సానుకూలంగా లేదని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన తర్వాత ఎంప్లాయీస్ జేఏసీ నేతలు బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో అత్యవసరంగా సమావేశమయ్యారు.
‘ఇక ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు. ఉద్యమాన్ని విరమిస్తే ఉద్యోగుల్లో మరింత చులకనవుతాం. ఎంతవరకైనా పోరాడుదాం. మీ వెనుక మేముంటాం. మీరు ముందు నడవండి’ అంటూ కొందరు ఉద్యోగులు నాయకుల వెన్నుతట్టారు. ‘ఎన్ని రోజులంటే అన్ని రోజులు సత్యాగ్రహ దీక్ష చేసేందుకు నేను సిద్ధం. కావాలంటే రాత్రి కూడా దీక్షలోనే పడుకుంటా’నని మరో నేత ముందుకొచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఉద్యమం ద్వారానే సర్కార్‌లో కదలిక సాధ్యమని మెజారిటీ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చే చర్యలను ముక్తకఠంతో ఖండించాలని నిర్ణయించారు.
నమ్మించి నాన్చడం దారుణం..
ప్రభుత్వం నమ్మించి నాన్చడం అత్యంత దారుణమని కొందరు జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ‘ఇన్ని రోజులు ఊరించి ఇచ్చేది ఒక డీఏనా.. అదేదో డిప్యూటీ సీఎంతో చర్చలప్పుడో.. ఈ నెల 9న చర్చలప్పుడో చెప్తే మా దారి మేం చూసుకునే వాళ్లం’ అంటూ కొందరు మండిపడ్డారు. ‘సీఎస్ హామీనిస్తేనే ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్‌ను వాయిదావేసుకున్నాం. రెండు రోజుల నుంచి వాయిదా వేస్తూ వచ్చి చావుకబురు చల్లన అన్నట్టు ఒక డీఏ ఇస్తామని చెప్పడమేమిటి?’ అని కొందరు జేఏసీ భాగస్వామ్య పక్షాలు సమావేశంలో ఫైర్ అయినట్టు తెలిసింది. జేఏసీ లేవనెత్తిందే నాలుగు డిమాండ్లు.. 64 నుంచి 4 డిమాండ్లకు తగ్గినా ఒక్కదానిపైనా కాలపరిమితితో కూడిన పరిష్కారం లభించకపోతే ఏమనుకోవాలని కొందరు నిలదీసినట్టు తెలిసింది.
సీఎస్ వైఖరి గర్హనీయం
జేఏసీ నేతలతో చర్చల సందర్భంగా సీఎస్ సంజయ్‌జాజు వ్యవహరించిన తీరును పలువురు నేతలు తప్పుపట్టారు. చర్చల సందర్భంగా ఇప్పుడొక డీఏ.. ఉగాదికి ముందు మరో డీఏ ఇస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పగా.. టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు చావా రవి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘13 లక్షల మంది ఉద్యోగుల ముందు మేం ఫూల్స్ కావా ల్నా?’ అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇందు కు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నావంటూ సీఎస్ సంజయ్‌జాజు ఆయనపై ఫైర్ అయినట్టు సమాచారం. ఈ ఘటనపై జేఏసీ అంతర్గత భేటీలో రచ్చ జరిగినట్టు తెలిసింది. జేఏసీ నాయకుడికి నాయకత్వం అండగా ఉండకపోవడంపై రవి అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది.
నేడు కీలక భేటీ.. ఆ తర్వాత కార్యాచరణ..
తాజా పరిణామాల నేపథ్యంలో ఎంప్లాయీస్ జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నాంపల్లి టీఎన్జీవో భవన్లో జరిగే ఈ సమావేశానికి జేఏసీ భాగస్వామ్య పక్షాల అధ్యక్ష ఫ్రధానకార్యుదర్శులు, జిల్లా జేఏసీ చైర్మన్లు, సెక్రటరీ జనరల్స్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశం తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 30లోపు నాలుగు హామీలపై స్పష్టతనివ్వకపోతే అక్టోబర్ 2న ఇందిరాపార్క్‌లో నిరవధిక సత్యాగ్రహ దీక్షను నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ దిగి వచ్చే వరకు ఇందిరాపార్క్‌లో దీక్షలను కొనసాగించాలని.. రోజుకో జిల్లా చొప్పున అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులను తరలించి ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చేలా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసినట్టు సమాచారం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే పెన్‌డౌన్, వర్క్ టు రూల్, సహాయనిరాకరణకు దిగాలన్న యోచనలో జేఏసీ నేతలున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

