WADA : నిషేధిత డ్రగ్ తీసుకొని డోప్ టెస్టులో పట్టుబడిన వాళ్లను చూశాం. వైద్య చికిత్సలో భాగంగా మందులు వాడిన అనంతరం డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అథ్లెట్లును చూశాం. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ఫెన్సర్ సరోరా థిబుస్ (Ysaora Thibus) మాత్రం అనుకోకుండా ఈ ఉచ్చులో చిక్కుకుంది. ఇంతకు ఆమె డోప్ పరీక్షలో విఫలం అయిన తీరు తెలిస్తే మీరే కాదు ఎవరైనా షాకవుతారు. అప్పీల్ విచారణ సందర్భంగా సరోరా చెప్పిన సమాధానం విని సైతం ఇలా కూడా జరుగుతుందా అనుకున్నారు.. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆమె నిషేధిత డ్రగ్ తీసుకోలేదని భావించి సస్పెన్షన్ వేయడాన్ని తప్పుబట్టారు.
అసలేం జరిగిందంటే.. నిరుడు జనవరిలో థిబుస్కు డోపింగ్ టెస్టు నిర్వహించగా నిషేధిత అనబాలిక్ ఒస్టరిన్ (Ostarine) ఉన్నట్టు తెలిసింది. దాంతో, ప్రపంచ డ్రగ్స్ నిరోధక సంస్థ ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాలని నిర్ణయించింది. అయితే.. పారిస్ ఒలింపిక్స్ ముందే ఫెన్నింగ్ సమాఖ్య థిబుస్ నిర్దేశి అని చెప్పి విశ్వక్రీడల్లో పోటీపడేందుకు అనుమతిచ్చింది. కానీ, వాడా మాత్రం అందుకు ససేమిరా అంది. ప్రియుడికి ముద్దు పెట్టడం ద్వారా థిబుస్ నమూనాల్లో నిషేధిత డ్రగ్ పాజిటివ్ వచ్చిందని.. ఆమెపై నిషేధం విధించాలని పట్టుబట్టింది. వాడా వాదనను క్రీడా విభేదాలను పరిష్కరించే లసానేలోని అర్బిట్రేషన్ కోర్టు తోసిపుచ్చింది.
French Olympic fencer Ysaora Thibus has been cleared of an anti-doping rule violation after judges accepted the contamination was due to kissing her former partner.
Thibus 33, was provisionally suspended from fencing after testing positive for ostarine, a selective androgen… pic.twitter.com/TVQadKnXIt
— The Athletic (@TheAthletic) July 7, 2025
టెస్టులకు 9 రోజుల ముందు అంటే జనవరి 5న థిబుస్ అప్పటి తన బాయ్‌ఫ్రెండ్ రేస్ ఇంబొడెన్ను ముద్దు పెట్టుకుంది. అతడి లాలాజలం ద్వారా ఆమె ఒంట్లోకి నిషేధితన ఓస్టరిన్ డ్రగ్ చేరి ఉంటుంది. అందుకే ఆమె శాంపిల్స్‌లో పాజిటివ్ వచ్చింది. అలా అనీ తను ఉద్దేశపూర్వకంగా ఆ డ్రగ్ తీసుకోలేదు. సో.. ఆమెపై వేటు వేయడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఫ్రాన్స్ ఫెన్నింగ్ స్టార్ అయిన థిబుస్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుపొందింది. పారిస్‌లో మాత్రం 28వ స్థానంతో నిరాశపరిచింది.