Wrestling | అమ్మాన్: జోర్డాన్‌లో జరుగుతున్న అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుష రెజ్లర్లకు నిరాశ తప్పడం లేదు. శుక్రవారం పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఐదుగురు బరిలోకి దిగితే ఒక్కరు కూడా క్వార్టర్స్‌కు చేరకపోగా శనివారమూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి.
జస్పూరన్ సింగ్ (110 కిలోలు) ఒక్కడే కాంస్య పోరుకు అర్హత సాధించాడు. తొలి రౌండ్లోనే అతడు జపాన్ ప్ర త్యర్థి యుకీ యమమొటొ చేతిలో ఓ డా డు. కానీ యుకీ ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్‌తో జస్పూరన్ కాంస్య పోరుకు దూసుకెళ్లాడు.
గెలుపు దిశగా ఇంగ్లండ్
మాంచెస్టర్: స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో లంక నిర్దేశించిన 205 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు 48 ఓవర్ల ఆట ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 33 రన్స్ కావాల్సి ఉండగా క్రీజులో జో రూట్ (45 నాటౌట్) వంటి సీనియర్ బ్యాటర్ ఉండటంతో ఇంగ్లండ్ విజయం నల్లేరు మీద నడకే.