WPL 2024 Auction: ముంబై వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) – 2024 వేలం ప్రక్రియలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డియోండ్ర డాటిన్‌కు చుక్కెదురైంది. డబ్ల్యూపీఎల్ 2024 వేలంలో భాగంగా తొలి రౌండ్లోనే రూ. 50 లక్షల కేటగిరీలో ఉన్న డాటిన్‌ను పోటీలో ఉన్న ఐదు ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. గతేడాది గుజరాత్ జెయింట్స్ చివరి సీజన్లో రూ. 60 లక్షలతో దక్కించుకున్నా ఆమె ఫిట్నెస్ టెస్టు కారణంగా ఆ సీజన్‌కు దూరమైంది.
గతేడాది వేలంలో ఆమెను గుజరాత్ దక్కించుకున్నా సీజన్ ఆరంభానికి ముందే ఆమెను తొలగించింది. దీనిపై డాటిన్ తీవ్ర విమర్శలు గుప్పించింది. డాటిన్ ఫిట్నెస్ లేమి కారణంగా తాము ఆమెను వదులుకున్నామని గుజరాత్ సమర్థించుకున్నా ఈ విండీస్ ఆల్ రౌండర్ మాత్రం తనకు అలాంటిదేమీ లేదని, తాను ఫిట్‌గానే ఉన్నానని ప్రకటించినా గుజరాత్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించింది. అయితే గుజరాత్ జెయింట్స్ డాటిన్ ఆరోపణలపై స్పందిస్తూ.. సీజన్‌కు ముందు ఆమె మెడికల్ సర్టిఫికెట్ అందించలేదని తమ చర్యను సమర్థించుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారం అప్పట్లో వివాదాస్పదమైంది. డాటిన్‌ను వదులుకున్న గుజరాత్.. ఆసీస్ పేసర్ కిమ్ గార్త్‌ను జట్టులోకి తీసుకుంది.
Deandra Dottin goes UNSOLD. #CricketTwitter | #WPLAuction | #WPL2024 pic.twitter.com/AF4TU6CL5B
— Female Cricket (@imfemalecricket) December 9, 2023
డాటిన్ గతేడాది వివాదంతోనే తాజా వేలంలో ఆమెను తీసుకోవడానికి ఐదు ఫ్రాంచైజీలు అనాసక్తి చూపెట్టాయి. ఆల్ రౌండర్ల జాబితాలో డాటిన్తో పాటు లంక సారథి చమారి ఆటపట్టు, నదైన్ డి క్లర్క్, డేనియల్ గిబ్సన్, భారత్‌కు చెందిన దేవికా వైద్యలను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.