Womens World Cup : సొంతగడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య జట్లు చెలరేగిపోతాయి. తమకు అనువైన వాతావరణ పరిస్థితులను బలంగా మార్చుకొని.. ప్రత్యర్థుల భరతం పడుతూ కప్ వేటలో ముందుంటాయి. కానీ, పదమూడో సీజన్ మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens ODI World Cup)లో మాత్రం సీన్ రివర్సైంది. ఆతిథ్య దేశాలైన భారత్ (India), శ్రీలంక (Srilanka)జట్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా వరుస ఓటములతో సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. రెండు విజయాలతో టోర్నీని ఆరంభించిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. ఆపై స్వల్ప తేడాతో నాలుగింటా ఓటిమిపాలైంది. అంతే.. సెమీస్ అవకాశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్ బెర్తులు కైవసం చేసుకోగా.. చివరి బెర్తుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సమీకరణాల ప్రకారం భారత్‌కు, ఇతర జట్లకు సెమీస్ ఆడేందుకున్న అవకాశాలను
పరిశీలిద్దాం.
వరల్డ్ కప్ లీగ్ దశ మ్యాచ్‌లు తుది అంకానికి చేరుతున్నాయి. టాప్ గేర్‌లో దూసుకెళ్లిన మూడు జట్లు సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా చివరి బెర్తు ఎవరిది? అనేది ఉత్కంఠ రేపుతోంది. నాలుగో సెమీస్ స్థానం కోసం ప్రధానంగా భారత్, న్యూజిలాండ్ (Newzealand) మధ్యే గట్టి పోటీ నెలకొంది. అయితే.. పాక్, శ్రీలంక కూడా రేసులోనే ఉన్నాయి. దాంతో.. తదుపరి మ్యాచ్ ఫలితాలను బట్టి చివరి బెర్తు నిర్ణయమవుతుంది. ప్రస్తుతం రెండు విజయాలతో టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నెట్రన్ రేటు 0.526 గా ఉంది. చివరి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
England win by 4 runs. #TeamIndia fought hard in a closely contested match and will look to bounce back on Thursday.
Scorecard ▶ https://t.co/jaq4eHaH5w#WomenInBlue | #CWC25 | #INDvENG pic.twitter.com/f9xKaO1ydg
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
అక్టోబర్ 24 గురువారంన వైట్ ఫెర్న్స్‌ను ఓడిస్తే దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్తుందిటీమిండియా. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే.. బంగ్లాదేశ్‌పైనా కచ్చితంగా గెలవాలి. అంతేకాదు.. న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ జట్టు ఓడించాలి. ఒకవేళ.. కివీస్‌తో మ్యాచ్ రద్దయినా శ్రీలంక, పాకిస్థాన్‌కు ఆరు పాయింట్లు రాకూడదు. ఇంగ్లండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సోఫీ డెవినె బృందాన్ని చిత్తు చేయాలి. అప్పుడు టీమిండియా.. ఏడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది.
న్యూజిలాండ్ విషయానికొస్తే.. ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. గురువారం పోరులో భారత్‌ను ఓడిస్తేనే ఆ జట్టు అవకాశాలు మెరుగుపడుతాయి. ఒకవేళ పరాజయం ఎదురైతే మాత్రం కివీస్ ఇంటికి వెళ్లాల్సిందే. అలాకాకుండా భారత్‌ను ఓడించి.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతే మాత్రం బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో టీమిండియా ఓడిపోవాలని సోఫీ డెవినె టీమ్ కోరుకోవాల్సి వస్తుంది. భారత్‌తో మ్యాచ్ రద్దయినా న్యూజిలాండ్‌కు ప్రమాదమేమీ లేదు.
Back-to-back washouts in Colombo.
Catch up on the scorecard | https://t.co/MgdxwLdjbU#NZvPAK #CWC25 📷 = ICC/Getty pic.twitter.com/la0oUQd5an
— WHITE FERNS (@WHITE_FERNS) October 18, 2025
చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేనను బంగ్లాదేశ్ ఓడిస్తే కివీస్‌కు అవకాశం ఉంటుంది. ఒకవేళ.. ఆ జట్టు రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే.. భారత్, పాక్, లంక జట్లలో ఆరు పాయింట్లు సాధించిన టీమ్ సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఇవన్నీ తలనొప్పులు ఎందుకనుకుంటే.. వరుసగా టీమిండియా, ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తే వైట్ ఫెర్న్స్ టీమ్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
వరుణుడి కారణంగా తీవ్రంగా నష్టపోయింది కో హోస్ట్ శ్రీలంక. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన లంక.. తదుపరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇంగ్లండ్‌ను నిలువరించలేక కుదేలైన చమరి ఆటపట్టు (Chamari Athapaththu) బృందానికి దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఇక బోణీ కొట్టకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందనే లంకకు బంగ్లాదేశ్‌పై విజయం ఊరటనిచ్చింది. దాంతో.. సెమీస్ రేసులోకి వచ్చింది ఆటపట్టు సేన. చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను శ్రీలంక ఓడించాలి. అంతేకాదు.. భారత్, న్యూజిలాండ్ ఆడనున్న రెండు మ్యాచ్ ఫలితాలపై ఆ జట్టు సెమీస్ అవకాశం ఆధారపడి ఉంది.
Hopes alive for Sri Lanka Women 🇱🇰 as Bangladesh Women 🇧🇩 become the first to be eliminated. 🏏 pic.twitter.com/UoQ8MYgm2w
— CricketGully (@thecricketgully) October 20, 2025
ఆసియా దేశమైన పాకిస్థాన్‌కు సైతం అవకాశాల్ని కొట్టిపారేయలేం. బౌలింగ్‌లో అదరగొడుతున్నా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా పాక్ వెనకబడింది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు రద్దుకాగా.. మూడింట పాక్ ఓడింది. మెగా టోర్నీలో బోణీ కొట్టని ఫాతిమా సనా (Fatima Sana) టీమ్.. దక్షిణాఫ్రికా, శ్రీలంకను భారీ తేడాతో ఓడిస్తే ఆరు పాయింట్లతో సెమీస్ రేసులోకి వస్తుంది. అయితే.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం కూడా పాక్ అవకాశాల్ని నిర్ణయిస్తుంది.
Can South Africa get their fifth W in a row? 👀#PAKvSA LIVE: https://t.co/kiBHEBurHO pic.twitter.com/cI9N7Nlv5y
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2025