దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆరోపణలను ఖండించిన స్ట్రీక్.. తాజాగా వాటిని అంగీకరించాడు. జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బౌలర్లలో ఒకడైన హీత్ స్ట్రీక్.. తర్వాత కోచ్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే అతడు అవినీతికి పాల్పడినట్లు విచారణ ఎదుర్కొంటున్నాడు.
2017, 2018లలో వివిధ మ్యాచ్‌ల సందర్భంగా అతడు తన టీమ్‌లోని ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండగా.. ఐపీఎల్, బీపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రిమియర్ లీగ్‌లలోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధక కౌన్సిలింగ్ సెషన్లకు హాజరైన స్ట్రీక్ ఇలా చేయడం బాధాకరమని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు.
Former Zimbabwe captain Heath Streak has been banned for eight years after being charged with multiple breaches of the ICC’s anti-corruption code pic.twitter.com/mf0p5RBYme
— ESPNcricinfo (@ESPNcricinfo) April 14, 2021
ఇవి కూడా చదవండి
కుంభమేళా ఒక కరోనా ఆటం బాంబు.. రాంగోపాల్ వర్మ సెటైర్లు
IPL 2021: సూర్యకుమార్ హిందీ టెస్ట్‌లో బౌల్ట్ పాస్.. వీడియో
కరోనా ఆంక్షలు.. రైల్వే స్టేషన్ ముందు భారీ క్యూలైన్లు
శంకర్‌తో రణ్వీర్.. అపరిచితుడు హిందీ రీమేక్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్‌తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం