కొలంబో: శ్రీలంక మాజీ ఆఫ్‌స్పిన్నర్ సచిత్ర సెననాయకే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. 2020లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో అతడు మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ సెననాయకపై కేసు నమోదు చేసింది.
ఇదే కేసులో సచిత్రను 2023లో ఒకసారి పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేశారు.