ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది
ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్‌తో రాజస్థాన్ మాజీ స్పిన్నర్ వివేక్ యాదవ్(36) కన్నుమూశారు.
గత కొన్నేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న యాదవ్ ఇటీవల కరోనా బారినపడ్డారు. చికిత్స కోసం జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాసవిడిచారు. యాదవ్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. రంజీ ట్రోఫీ నెగ్గిన జట్టులో వివేక్ సభ్యుడు.
‘రాజస్థాన్ రంజీ ప్లేయర్, ప్రియమైన స్నేహితుడు వివేక్ యాదవ్ ఇకలేరు. ఆయన ఆత్మకు శాంతి
చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానంటూ’
భారత మాజీ ఓపెనర్ ఆకాశ్‌చోప్రా ట్వీట్ చేశాడు.
Rajasthan Ranji Player and a dear friend…Vivek Yadav is no more. May his soul R.I.P. Thoughts and prayers with the family 🙏 Om Shanti.
— Aakash Chopra (@cricketaakash) May 5, 2021