Vinod Kambli | పుణె: ఆరోగ్య సమస్యలతో గత వారం పుణెలోని ఓ దవాఖానలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి కోలుకున్నాడు. మూత్రపిండాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అతడు.. పూర్తిస్థాయిలో కోలుకున్నాడని కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు. బుధవారం సాయంత్రం కాంబ్లీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు.