Suresh Raina | ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో ఇండియన్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ (Delhi)లోని ఈడీ కార్యాలయానికి (ED office) వెళ్లిన సురేశ్ రైనా.. అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాజీ క్రికెటర్‌ను విచారిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అతని వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నది.
#WATCH | Former Indian Cricketer Suresh Raina reaches ED office in Delhi to record his statement in 1xBet case following summons by the agency. pic.twitter.com/wJAw1gACt5
— ANI (@ANI) August 13, 2025
1xBet అనే యాప్‌కు సంబంధించిన అక్రమ బెట్టింగ్ కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలంటూ సురేశ్ రైనాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ ఆదేశాల మేరకు సురేశ్ రైనా ఇవాళ విచారణకు హాజరయ్యారు.
అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. సురేశ్ రైనా టీమిండియా మాజీ ప్లేయర్. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 322 అంతర్జాతీయ మ్యాచులు ఆడి దాదాపు 8వేల పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ రైనా. ఐపీఎల్‌లోనూ సీఎస్కే తరఫున ఆడాడు. ఐపీఎల్ రైనా కెరీర్ అద్భుతంగా ఉంది. 205 మ్యాచ్‌ల్లో 5,528 పరుగులు చేశాడు. నాలుగు సార్లు సీఎస్కేను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
Also Read..
India-China flights | ఐదేళ్ల తర్వాత భారత్-చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్..!
Pakistan Spy: పాక్‌కు సమాచారం చేరవేస్తున్న డీఆర్డీవో గెస్ట్ హౌజ్ మేనేజర్ అరెస్టు
Dead Body | మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన మార్చురీ అసిస్టెంట్, పోలీసు