కరోనాతో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి కన్నుమూత

న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్‌తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మృతిచెందిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ‘నా తండ్రి శివప్రసాద్ సింగ్ కన్నుమూసిన విషయాన్ని తీవ్ర దు:ఖంతో తెలియజేస్తున్నాను. కొవిడ్‌తో బాధపడుతూనే మే 12న మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా మీరంతా ఆ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా. ఆర్ఐపీ పాపా’ అంటూ సింగ్ ట్వీట్ చేశాడు.
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆర్పీ కూడా ఉన్నాడు. భారత్ తరఫున సింగ్
14 టెస్టు మ్యాచ్‌లు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్పీ 32 ఏండ్ల వయసులో 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వీడ్కోలు అనంతరం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. భారత సీనియర్ లెగ్‌స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ (60) కూడా కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

