Bimal Lakra : భారత మాజీ హాకీ ఆటగాడు బిమల్ లక్రా (Bimal Lakra) ఆస్ప్రతి పాలయ్యాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆయనను మంగళవారం హుటాహుటిన సమీపలోని దవాఖానకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం లక్రాను అక్కడ నుంచి రాంచీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. జార్ఘండ్ క్రీడా శాఖ మంత్రి ఆస్పత్రికి వెళ్లి బిమల్ను పరామర్శించారు.
అసలేం జరిగిందంటే.. సోమవారం తన పొలంలో పనిచేస్తున్న బిమన్ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. దాంతో, ఆయన తలకు బలమైన గాయాలు అయ్యాయి. దాంతో, బిమల్‌కు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అధికారులను అదేశించారు. మిడ్‌ఫీల్డర్ అయిన బిమల్ 2022లో ఆసియా క్రీడల్లో రజతం గెలుపొందిన జట్టులో సభ్యుడు. అంతేకాదు 2003, 2007లో ఆసియా కప్ ఛాంఫియన్ కూడా.