అబిడ్స్ : మంగళ్ హాట్ ఆర్కేపేట్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ బొడ్రాయి పోత లింగన్న దేవాలయం వద్ద శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. హిందూ యువజన సంఘం (Hindu Yuvajana Sangham) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవానికి బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీళ్లతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చిఈ వేడుకను కనులారా వీక్షించారు.
ఒగ్గు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం నిర్వాహకులు రేగొండ దామోదర్, రేగొండ రాములు, జె శ్రీనివాస్ చారి, రేగొండ రామకృష్ణ, సతీష్ చారి, హిందూ యువజన సంఘం ప్రతినిధులు అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు.