లండన్ : ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ రాబిన్ స్మిత్ (62) కన్నుమూశారు. 1988 నుంచి 1996 దాకా ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులాడిన స్మిత్.. 43.67 సగటుతో 4,236 రన్స్ చేశారు. 90వ దశకంలో ఆయన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకగా ఉంటూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
వెస్టిండీస్, ఆస్ట్రేలియా పేసర్లకు తన బ్యాట్‌తో దీటుగా బదులిస్తూ ఆయన ఆడిన ఆట ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులను అలరించింది. దక్షిణాఫ్రికాలో పుట్టిన స్మిత్.. ఇంగ్లండ్‌కు వలసవచ్చి ఆ దేశం తరఫున ఆడినా తన చివరి రోజులను ఆయన ఆస్ట్రేలియాలో గడిపారు.