Virat Kohli : పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసేలా ఉంది. స్పిన్ సమర్థంగా ఆడగల ప్రధాన ఆటగాళ్లు సైతం ‘మా వల్ల కాదంటూ’ వెనుదిరగడం అభిమనులను ఆశ్చర్యానికి గురి చేసింది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ (7/53) తిప్పేయగా వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ గల భారత్ ప్రత్యర్థికి భారీ ఆధిక్యాన్ని ఇచ్చేసింది. అయితే.. రెండో రోజు భారత ఆటగాళ్ల షాట్ల ఎంపికపై మాజీలు మండిపడుతున్నారు. ముఖ్యంగా స్వదేశంలో ఘనమైన రికార్డు గల విరాట్ కోహ్లీ (Virat Kohli) అతడి కెరీర్లోనే చెత్త షాట్ ఆడాడంటూ కామెంటేర్లు విమర్శిస్తున్నారు.
ఓవర్‌నైట్ స్కోర్ 16-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు కివీస్ స్పిన్నర్ సాంట్నర్ షాకిచ్చాడు. తొలి సెషన్లోనే శుభ్‌మన్ గిల్(30) వికెట్ తీసిన సాంట్నర్.. ఆ కాసేపటికే విరాట్ కోహ్లీ(1)ను ఫుల్‌టాస్ బంతితో బౌల్డ్ చేశాడు.అప్పటివరకూ 9 బంతుల్ని చక్కగా ఎదుర్కొన్ని విరాట్.. ఆ బంతిని మాత్రం సరిగ్గా అంచనా వేయలేక షాట్ ఆడాడు. అంతే.. బ్యాటు కింద నుంచి దూసుకెళ్లి ఆ బాల్ వికెట్లను గిరాటేసింది. సాంట్నర్ సంధించిన ఆ బంతి ఆడేందుకు ఏమంత కష్టమైనది కాదని రీప్లేలో తేలింది.
Oh dear! Virat will know himself that he has just played the worst shot of his career to get out. Got to feel for him…coz as always he came out with solid & honest intent.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 25, 2024
‘తన కెరీర్లోనే పరమ చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాననే విషయం కోహ్లీకి కూడా తెలుసు. అయితే.. అలా వికెట్ ఇచ్చేసినందుకు కోహ్లీ ఎంతో బాధపడి ఉంటాడు. ఎందుకంటే.. మైదానంలోకి వచ్చిన ప్రతిసారి అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనే పట్టుదల కనబరుస్తాడు’ అని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఇక భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే (Anil Kumble) అయితే కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ‘ఒకటి రెండు ఇన్నింగ్స్‌లు ఆడితే కోహ్లీ సెట్ అవుతాడు. కానీ, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు విరాట్ రంజీల్లో ఆడితే అతడికి మంచి ప్రాక్టీస్ లభించేది’ అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
స్పిన్ పిచ్ మీద భారత బౌలర్లు తొలిరోజే న్యూజిలాండ్ (Newzealand)ను స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేశారు. ఇక భారీ స్కోర్ అందించి జట్టును గట్టెక్కించాల్సిన బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. టర్నింగ్ పిచ్ మీద మేము ఆడలేమంటూ.. చెత్త షాట్లతో వికెట్ పారేసుకున్నారు. ఫలితంగా.. పట్టుబిగించాల్సిన చోట టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది.
Stumps on Day 2
New Zealand extend their lead to 301 runs
Scorecard ▶️ https://t.co/3vf9Bwzgcd#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/uFXuaDb11y
— BCCI (@BCCI) October 25, 2024
మిచెల్ సాంట్నర్(7/53) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ రోహిత్ సేనను దెబ్బకొట్టగా.. కెప్టెన్ టామ్ లాథమ్(86), వికెట్ కీపర్ టామ్ బ్లండెల్(30 నాటౌట్)లు తాపీగా ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. రెండో రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి.. ఆధిక్యాన్ని 301కి పెంచుకుంది. ఈ టెస్టులో ఓటమి తప్పాలంటే బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగినట్టు భారత బ్యాటర్లు తమ తడాఖా చూపించాలి.