Caroline Gracia : మాజీ ఛాంపియన్ కరోలినె గార్సియా (Caroline Gracia) త్వరలోనే టెన్నిస్‌కు టాటా చెప్పనుంది. ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2025) తనకు చివరి టోర్నీ అని వెల్లడించిదీ ఫ్రాన్స్ బ్యూటీ. మట్టి కోర్టులో చెలరేగేందుకు సిద్దమవుతన్న కరోలినా శుక్రవారం మాట్లాడుతూ తన రిటైర్మెంట్ ఆలోచనను తెలియజేసింది. ’15 ఏళ్లుగా పలు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాను. దాదాపు 25 ఏళ్లుగా టెన్నిస్ కోసమే ప్రతి సెకను వెచ్చించాను. ఇక నా కెరియర్‌కు ముగింపు పలికి కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసింది’ అని కరోలినా వెల్లడించింది.
‘చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ ఆడబోతున్నా. ఇదే నాకు ఆఖరి టోర్నమెంట్. అయితే.. మరికొన్ని టోర్నీలు ఆడగల సామర్థ్యం నాకుంది. ఇన్నేళ్లు టెన్నిస్ ఆడడం అంత సులువ కాదు. పలుమార్లు గాయాలు వేధించినా.. ఆటను మాత్రం వదల్లేదు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆటను ప్రేమించాను. విమర్శలను కూడా పాజిటివ్‌గానే తీసుకున్నా. నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలను మిగిల్చినందుకు నేను టెన్నిస్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
🎾 « Mon corps et mes aspirations personnelles me le demandent » : la Lyonnaise Caroline Garcia met un terme à sa carrière#Lyon
➡️ https://t.co/WTuvmQ3C0f pic.twitter.com/4sN3Y6GpIF
— Le Progrès Lyon (@leprogreslyon) May 23, 2025
కరోలినె గార్సియా
ఈ ఆట నన్ను ద్రుఢమైన మహిళగా తీర్చిదిద్దింది. అయితే.. నా శరీరం, నా మనసు ఒకటే చెబుతున్నాయి. ఇక చాలు.. వీడ్కోలుకు వేళ అయిందని. సో.. నాకెంతో ఇష్టమైన మట్టి కోర్టు టోర్నీతో అల్విదా పలకబోతున్నా’ అంటున్న కరోలినా 2016, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలుపొందింది.
తన సుదీర్ఘ కెరీర్లో ఈ ఫ్రాన్స్ అందం 11 ట్రోఫీలు సాధించింది. ఈమధ్యే యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన కరోలినా ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ప్రస్తుతం 145వ ర్యాంకర్ అయిన కొరోలినా తొలి రౌండ్లో క్రొయేషియా – అమెరికా క్రీడాకారిణి అయిన బెర్నార్డా పెరాను ఢీ కొట్టనుంది.