ఇంజమామ్ రాజీనామా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రకంపనలు మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు పేలవ ఆటతీరు కనబరుస్తుండగా.. పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రకంపనలు మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు పేలవ ఆటతీరు కనబరుస్తుండగా.. పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. ఆ లేఖను పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌కు పంపించాడు.
ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంజమామ్ మాట్లాడుతూ.. ‘వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదు. ఈ అంశంపై పీసీబీ విచారణ చేపట్టాలి. నాకు ప్లేయర్ ఏజెంట్ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదు’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

