ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ సారథి తమీమ్ ఇక్బాల్ స్వల్ప వ్యవధిలో రెండు సార్లు గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా మహమ్మదాన్ స్పోర్టిం గ్ క్లబ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న అతడు మైదానంలోకి రాగానే ఛాతిలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడటంతో తమీమ్‌ను ఫజిలాతున్నెసాలోని ఓ దవాఖానాకు తరలించారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని బీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.