Sairaj Bahutule | ముంబై: త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు తాత్కాలిక బౌలింగ్ కోచ్గా మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులే నియమితుడు కానున్నట్టు సమాచారం. హెడ్కోచ్ గౌతం గంభీర్ తనకు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ కావాలని బీసీసీఐ వద్ద పంతం నెగ్గించుకున్నా వ్యక్తిగత కారణాలతో అతడు లంకతో సిరీస్లో చేరేది అనుమానంగానే ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న బహుతులేను లంకతో సిరీస్ వరకు తాత్కాలిక బౌలింగ్ కోచ్గా నియమించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.