న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరి నెలలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల(3.97 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తరలించుకుపోయారు.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఎఫ్‌పీఐలు భారీ స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి తోడు డెరివేటివ్‌లపై సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్‌ను భారీగా పెంచడం కూడా భవిష్యత్తులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. 2025 సంవత్సరంలో ఎఫ్‌పీఐలు రూ.1.66 లక్షల కోట్లు(18.9 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తరలించుకుపోయారు.