కొత్తపల్లి/మానకొండూర్, అక్టోబర్ 27: జాతీయస్థాయి యోగా పోటీల్లో తెలంగాణకు తొలిసారిగా స్వర్ణ పతకం లభించింది. ఈనెల 24-27 మధ్య హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో జరిగిన పోటీల సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లికి చెందిన దీపక్ పసిడి పతకంతో మెరిశాడు. దీపక్ మానకొండూరులోని సాంఘీక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.