ఇందూరు, అక్టోబర్ 16: వహీద్ స్మారక జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో తమిళనాడు, కేర్ ఫుట్బాల్ అకాడమీ (ఎఫ్సీ) జట్లు ఫైనల్కు చేరాయి. నిజామాబాద్ శివారులోని రాజారాం స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్లో కేరళపై తమిళనాడు.. తెలంగాణపై కేర్ ఫుట్ బాల్ అకాడమీ జట్లు విజయాలు సాధించాయి. నేడు జరుగనున్న తుదిపోరులో తమిళనాడు, కేర్ ఎఫ్సీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడో స్థానం కోసం తెలంగాణ, కేరళ పోటీ పడనున్నాయి. సెమీస్ మ్యాచ్కు హాజరైన సినీ నిర్మాత దిల్రాజు క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సెస్సార్ విద్యాసంస్థల అధినేత మారయ్యగౌడ్, రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి ఫాల్గుణ, తదితరులు పాల్గొన్నారు.