Football Commentator : ఫుట్‌బాల్ లైవ్ కవరేజి ఇస్తున్న ఓ కామెంటేటర్ (Football Commentator) హఠాత్తుగా కిందపడ్డాడు. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న అతను ఉన్నపళంగా నేలపై పడిపోయాడు. ఊహించని సంఘటనతో అతడి పక్కనే ఉన్న మరో కామెంటేటర్‌తో పాటు అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. అయితే.. అతడికి ప్రమాదమేమి లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
క్యాలీఫోర్నియాలోని ఓ మైదానంలో రియల్ మాడ్రిడ్(Real Madrid), ఏసీ మిలాన్(AC Milan) జట్ల మధ్య ప్రీ- సీజన్ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ముందు.. ఫుట్‌బాల్ విశ్లేషకుడు, షక హిస్లోప్(Shaka Hislop) తన సహచరుడు డాన్ థామస్(Dan Thomas)తో కలిసి లైవ్ టీవీలో మాట్లాడుతున్నాడు. స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపేను పారిస్ సెయింట్ క్లబ్ ప్రీ- సీజన్ టూర్ నుంచి తప్పిస్తుందా? అని అడిగాడు. దానికి బదులు ఇచ్చే క్రమంలో హిస్లోవ్ పగలబడి నవ్వాడు. నవ్వుతూ.. నవ్వుతూ.. అలానే కింద పడిపోయాడు. దాంతో, షాక్‌కు గురైన థామస్ వెంటనే వైద్యులను పిలిచాడు.
ESPN FC Commentator Shaka Hislop collapsed on live TV before the Real Madrid vs. AC Milan friendly.
He is now in stable condition. No further reports on medical condition or reason for collapse reported at this time. pic.twitter.com/2lxRfxfFWM
— DiedSuddenly (@DiedSuddenly_) July 24, 2023
షిస్లోప్ను పరీక్షించిన వైద్యులు అతడి ఆరోగ్యం బాగుందని. అతడకిఇ ప్రమాదం ఏం లేదని చెప్పారు. అయితే.. అతను ఉన్నట్టుండి కిందపడడానికి కారణం ఏంటి? అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. కొంచెం సేపటికే షిస్లోప్ స్పృహలోకి వచ్చాడు. మాట్లాడుతున్నాడు కూడా. ఊహించని పరిణామంతో అతను అసౌకర్యంగా ఫీలవుతున్నాడు అని థామస్ తెలిపాడు.
వెస్ట్ హమ్(West Ham) జట్టు మాజీ గోల్‌కీపర్(Goalkeeper) అయిన షొర్లోప్ 250 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్లో న్యూక్లాస్లే యునైటెడ్, వెస్ట్ హమ్ యునైటెడ్, పోర్ట్స్మౌత్.. వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వా షొర్లోప్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు.