Ravichandran Ashwin : భారత జట్టు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) మరో ఘనత సాధించాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టాడు. దాంతో, టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెస్టిండీస్ సిరీస్(westindies series)లో వికెట్ల వేట కొనసాగిస్తున్న అతను ఈ మైలురాయికి చేరువయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్ క్రిక్ మెకంజీ(0)ని బౌల్డ్ చేసిన అశ్విన్ 712వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, భజ్జీని 711 వికెట్లను మూడో స్థానానికి నెట్టాడు. ఈ జాబితాలో 956 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌కు తొలి వరల్డ్ కప్(ODI WC 1983) అందించిన కపిల్ దేవ్ 68 వికెట్లు, మాజీ పేసర్ జహీర్ ఖాన్(610 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకూ అశ్విన్ టీమిండియా తరఫున 272 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 489, వన్డేల్లో 151, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.
అనిల్ కుంబ్లే, అశ్విన్
అశ్విన్‌కు వెస్టిండీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఈ క్యారమ్ బాల్ స్పెషలిస్ట్ ఇప్పటివరకూ 75 మంది కరీబియన్లను ఔట్ చేశాడు. దాంతో, లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే(74 వికెట్లు)ను వెనక్కి నెట్టేశాడు. విండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరో తెలుసా..? దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్(Kapil Dev). అతడు 89 మందిని పెవిలియన్ పంపాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అశ్విన్ విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(Kraigg Brathwaite)ను ఏకంగా 9 సార్లు ఔట్ చేయడం విశేషం.
తమిళనాడు రంజీ జట్టు తరఫున అదరగొట్టిన అశ్విన్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అతడు 2010లో భారత జట్టు తరఫున ఆరంగేట్రం చేశాడు. భజ్జీ వారసుడిగా ఆఫ్ స్పిన్ బాధ్యతలు తీసుకున్న అతను మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 33వసారి. పది వికెట్ల హాల్ కూడా ఉన్నాయి. 2017 నుంచి వన్డేలకు దూరమైనా కూడా ఈ ఫీట్ సాధించడం విశేషం. గత కొంత కాలంగా అశ్విన్ నికలకడగా రాణిస్తూ.. వరల్డ్ నంబర్ 1 టెస్టు ఆల్‌రౌండర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.