Team India : స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ ముందు భారత జట్టు (Team India) చిట్టచివరి సిరీస్ ఆడనుంది. వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకుంటున్న టీమిండియా అన్ని అస్త్రాలను సరి చూసుకోనుంది. న్యూజిలాండ్ (Newzealand)తో ఐదు టీ20ల సిరీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు చాలా మంచి అవకాశం. అయితే.. ప్రతిభావంతులకు కొదవలేకున్నా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ గురించే అందరి ఆందోళనంతా. ఇటీవల వరుసగా తేలిపోతున్న మిస్టర్ 360 మెగా టోర్నీ ముందు టచ్‌లోకి వస్తాడా? తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో ఎవరు ఆడుతారు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
పొట్టి క్రికెట్లో వరుస సిరీస్ విజయాలతో భారత జట్టు తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా గడ్డపై, స్వదేశంలో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించిన టీమిండియా ఈసారి న్యూజిలాండ్‌కు చెక్ పెట్టాలనుకుంటోంది. వన్డే సిరీస్‌లో సంచలన ఆటతో విజేతగా నిలిచిన బ్లాక్‌క్యాప్స్‌ను పొట్టి ఫార్మాట్లో చావుదెబ్బ కొట్టాలని సూర్యకుమార్ సేన పట్టుదలతో ఉంది.
What would be your ideal India XI for the #INDvNZ T20Is? pic.twitter.com/7YvLQ6TCvS
— ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2026
జనవరి 21న బుధవారం నాగ్‌పూర్‌లో టీ20 సిరీస్ షురూ కానుంది. స్క్వాడ్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma), సంజూ శాంసన్ (Sanju Samson), హార్దిక్ పాండ్యా.. రింకూ సింగ్ వంటి బిగ్ హిట్టర్లు, మ్యాచ్ విన్నర్లు చాలామందే. కానీ, సారథి సూర్య ఆటపైనే సందేహాలున్నాయి. రెండేళ్లక్రితం టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి అతడి గణాంకాలు దారుణంగా పడిపోయాయి. 22 ఇన్నింగ్స్‌ల్లో 12.84 సగటుతో 244 రన్స్ చేశాడతే. శాంసన్ మూడు సెంచరీలతో.. తానెంత ప్రమాదకరమో ఇప్పటికే చాటుకున్నాడు.
గాయంతో సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఆడిస్తారా? ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారా? అనేది ఆసక్తి రేపుతోంది. మూడేళ్ల క్రితం డిసెంబర్లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అయ్యర్‌కు ఐపీఎల్ ఫైనలే ఫ్రాంచైజీ క్రికెట్లో ఆఖరిది.
A first together in Indian blue 🇮🇳💙
[Ishan Kishan | Abhishek Sharma | Play With Fire | IND vs NZ] pic.twitter.com/n8boJqeVJD
— SunRisers Hyderabad (@SunRisers) January 20, 2026
అదే ఇషాన్ కిషన్ విషయానికొస్తే.. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో జార్ఘండ్ సారథిగా ఇరగదీశాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో జట్టును విజేతగా నిలిపిన ఈ చిచ్చరపిడుగు.. సెలెక్టర్ల దృష్టిలో పడి ప్రపంచకప్ బెర్తు సైతం దక్కించుకున్నాడు. కాబట్టి.. ఈ లెఫ్ట్హ్యాండర్కే తొలి టీ20లో అవకాశం దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.