Border – Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు రేపు ఇండోర్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్ సిరీస్ క్వీన్స్లీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. వరుస ఓటములకు ముగింపు పలకాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే.. అందరి కళ్లు ఓపెనర్ కేఎల్ రాహుల్ మీదే నిలిచాయి. రెండు మ్యాచుల్లో విఫలమైన అతను పరుగులు సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రెండు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 38 రన్స్ చేశాడంతే. వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అతడికి ఈమ్యాచ్‌లోనూ రాణించకుంటే జట్టులో చోటు దక్కడం కష్టమే.
మూడో టెస్టులోనైనా పరుగులు సాధించాలని నెట్స్‌లో అతను తీవ్రంగా సాధన చేశాడు. ఈ టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో జూన్‌లో జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
కీలకమైన మూడో టెస్టులో రోహిత్ శర్మ జోడీగా ఓపెనింగ్ చేసేది ఎవరు? అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ఫామ్‌లో లేని రాహుల్‌కు మరొక అవకాశం ఇస్తారా? కెరీర్లోనే భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో రోహిత్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ రెండుసార్లు వందకు పైగా భాగస్వామ్యాలు నిర్మించాడు. అంతేకాదు రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాదాడు. దాంతో, రాహుల్‌ను పక్కనపెట్టి ఈ యంగ్‌స్టర్‌కు ఛాన్స్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.
ఓటమి భారంతో కుంగిపోతున్న ఆసీస్ ఇండోర్ టెస్టులో గెలవాలనే కసితో ఉంది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ జట్టులోకి రావడంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ ఇద్దరు గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా స్వదేశంలోనే ఉండిపోవడంతో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా రాణించడం చాలా ముఖ్యం. ఆ జట్టు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, హ్యాండ్స్కాంబ్పై ఆ జట్టు ఎక్కుగా ఆధారపడుతోంది. ఇండియన్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను రెండు టెస్టుల్లో గెలిచిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.