Achraf Hakimi | మొరాకో ఫుట్‌బాలర్‌పై అత్యాచారం ఆరోపణలు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
బ్రెజిల్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్ తర్వాత మరో ఫుట్‌బాలర్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మొరాకో ఫుట్‌బాలర్ అష్రఫ్ హకీమిపై ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఫిబ్రవరి 25న హకీమి తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. లియోనల్ మెస్సీ ఆడుతున్న పీఎస్జీ (ప్యారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్లో అతను సభ్యుడు.
Achraf Hakimi : బ్రెజిల్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్ తర్వాత మరో ఫుట్‌బాలర్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మొరాకో ఫుట్‌బాలర్ అష్రఫ్ హకీమిపై ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఫిబ్రవరి 25న హకీమి తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. అతని ఇంటికి ఆహ్వానించి తనను రేప్ చేశాడని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. దాంతో, కేసు నమోదు చేసుకున్న ప్యారిస్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అష్రఫ్ హకీమిని ప్రశ్నిస్తున్నారు.
అత్యాచార ఆరోపణలు చేసిన మహిళతో హకీమికి ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. జనవరి 16న అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో చాటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫుట్బాలల్ హకీమి భార్య హిబా అబౌక్ తమ ఇద్దరి పిల్లలతో దుబాయ్ పర్యటనలో ఉంది. డిఫెండర్ అయిన హకీమి మొరాకో జాతీయ జట్టుతో పాటు పలు క్లబ్స్‌కు ఆడతున్నాడు. ప్రస్తుతం లియోనల్ మెస్సీ ఆడుతున్న పీఎస్జీ (ప్యారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్లో అతను సభ్యుడు. తొడ కండరాలు పట్టేయడంతో అతనుఆదివారం మార్సియెల్లేతో జరిగిన మ్యాచ్ ఆడలేదు. హకీమి విషయంపై స్పందించేందుకు ఆ క్లబ్ అధికారులు నిరాకరించారు.
వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు
స్పెయిన్‌లో జన్మించిన హకీమి మొరాకో జట్టులో ముఖ్యమైన ఆటగాడు. ఖతర్ వేదికగా పోయిన ఏడాది జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఆ జట్టు సెమీస్ చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నమెంట్లో పెద్ద జట్లకు షాకిచ్చిన మొరాకో నాలుగో స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా, ఫ్రాన్స్‌ను ఓడించింది. మూడోసారి వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేసినా కూడా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన మెస్సీ తన వరల్డ్ కలను నిజం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Ben Stokes | ఐపీఎల్ నుంచి తప్పుకోవడం లేదు.. టోర్నీ మొత్తం ఆడతా : బెన్ స్టోక్స్
NZ vs ENG | రెండో టెస్టులో న్యూజిలాండ్ సంచలన విజయం.. బౌన్సర్లతో బెంబేలెత్తించిన వాగ్నర్
Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహం.. 2023 వరల్డ్‌కప్ సందర్భంగా ఏర్పాటు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

