Ben Stokes | ఐపీఎల్ నుంచి తప్పుకోవడం లేదు.. టోర్నీ మొత్తం ఆడతా : బెన్ స్టోక్స్
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్లో ఆడతానని ప్రకటించాడు. దాంతో, అతను టోర్నీ మధ్యలోనే స్వదేశం వెళ్తాడనే వార్తలకు తెరదించాడు. 2023 ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
Ben Stokes : చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్లో ఆడతానని ప్రకటించాడు. దాంతో, అతను టోర్నీ మధ్యలోనే స్వదేశం వెళ్తాడనే వార్తలకు తెరదించాడు. న్యూజిలాండ్‌పై రెండో టెస్టు ఓటమి అనంతరం స్టోక్స్ మీడియాతో మాట్లాడాడు. ‘సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో మాట్లాడాను. అతనికి నా ఫిట్నెస్ గురించి అన్ని విషయాలు తెలుసు. ఐపీఎల్‌కు సన్నద్ధం అయ్యేందుకు ఫిజియో, వైద్యబృందంతో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నా. ఫినిషర్, ఆల్‌రౌండర్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. జూన్‌లో జరగనున్న యాషెస్ టెస్టు సిరీస్‌కు ఫిట్‌గా ఉండడం తనకు చాలా ముఖ్యమని స్టోక్స్ అన్నాడు.
‘యాషెస్‌కు నాలుగైదు నెలల సమయం ఉంది. బర్మింగ్హమ్లో ప్రారంభమయ్యే మొదటి టెస్టులో కెప్టెన్‌గా నా బాధ్యతకు న్యాయం చేయాలి. అందుకుని నేను అన్నివిధాలా సిద్ధపడుతున్నాను’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. వెల్లింగ్టన్ టెస్టులో ఐదో రోజు బ్యాటింగ్ చేస్తుండగా స్టోక్స్ ఎడమ మోకాలికి గాయం అయింది. దాంతో, రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
రూ.16.25 కోట్లకు
పదహారో సీజన్ ఐపీఎల్ మినీ వేలంలో బెన్ స్టోక్స్ భారీ ధర పలికాడు. అతడిని దక్కించుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. చివరకు రూ.16.25 కోట్లకు సీఎస్కే ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. అతనిపై ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే.. వేసవిలో ఐర్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం స్టోక్స్ ఇంగ్లండ్ వెళ్తాడని, అతను ఐపీఎల్ నుంచి మధ్యలోనే తప్పుకుంటాడనే వార్తలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. దాంతో, సీఎస్కే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 2023 ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి
NZ vs ENG | రెండో టెస్టులో న్యూజిలాండ్ సంచలన విజయం.. బౌన్సర్లతో బెంబేలెత్తించిన వాగ్నర్
Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహం.. 2023 వరల్డ్‌కప్ సందర్భంగా ఏర్పాటు
Rajkumar Sharma | అందరూ విమర్శిస్తుంటే.. అతనొక్కడే కోహ్లీకి మద్దతుగా నిలిచాడు : విరాట్ చిన్నప్పటి కోచ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

